ఏపీని ఆర్థికంగా దివాలా తీయించి సీఎంగా జగన్ రికార్డుల కెక్కారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అప్పులపై కేంద్రం లేఖ జగన్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతోందిని పేర్కొన్నారు. కేంద్రం పేర్కొన్న రూ.49,280 కోట్ల మూలధన వ్యయం ఎక్కడ ఉందని యనమల ప్రశ్నించారు. రాష్ట్రం చేసిన రూ.19 వేల కోట్ల మూలధన వ్యయం ఎక్కడ అని నిలదీశారు. అభివృద్ధి పనులకు సున్నా.. పేదల సంక్షేమానికి పంగనామాలు పెట్టారని యనమల రామకృష్ణుడు విమర్శించారు.
'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి' - తిరుపతి ఉప ఎన్నికల యనమల వ్యాఖ్యలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఏపీ అప్పులపై కేంద్రం లేఖ జగన్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతోందిని పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు అడిగే హక్కులేదని అన్నారు.
తిరుపతి ఉపఎన్నికల్లో ప్రజల్ని ఓటడిగే హక్కు వైకాపాకు లేదని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. తమ పార్టీకి ఓటెయ్యాలంటూ సీఎం జగన్ ప్రజలకు లేఖ రాయటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సీఎం లేఖలు రాయాల్సింది తిరుపతి ప్రజలకు కాదని.. ప్రత్యేక హోదా, విభజన సమస్యలు, స్టీల్ ప్లాంట్ వ్యవహారం వంటి వాటిపై ప్రధాని మోదీకి లేఖలు రాసి నిలదీయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా.. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులను నీరుగార్చారని యనమల దుయ్యబట్టారు. వైకాపాను ఓడిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని యనమల అన్నారు.
ఇదీ చదవండి: మళ్లీ లాక్‌డౌన్ రానివ్వొద్దు : సీఎం జగన్