రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రజల ముందు ఒకే అవకాశం ఉందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడమే ప్రజల ముందున్న కర్తవ్యమని ఆయన సూచించారు. రాష్ట్ర పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు గవర్నర్ స్పందించాలన్నారు. అప్రజాస్వామిక చర్యలపై గవర్నర్‌కు మూడుసార్లు ఫిర్యాదు చేశామన్న ఆయన.. గవర్నర్ వ్యవస్థ కూడా స్పందించలేని పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఏకైక వ్యక్తి జగనేనని దుయ్యబట్టారు. రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఎన్నికల ముందే తెదేపా నేతల భద్రత తొలగించారని ఆయన ఆరోపించారు. అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని ఇక ప్రజలే కాపాడాలని యనమల పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక న్యాయస్థానాలదేనని పేర్కొన్నారు.
అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడాలి: యనమల - తెదేపా సీనియర్ నేత యనమల రామకష్ణుడు తాజా వార్తలు
సీఎం జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రం ఏమైనా ముఖ్యమంత్రికి అవసరం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని ఇక ప్రజలే కాపాడాలని యనమల పిలుపునిచ్చారు.
Yanamala