గత 8 నెలల్లో వైకాపా మాఫియా పాలనతో పేదల పొట్టకొట్టారని తెదేపా సీనియర్ నేత యనమల ఆరోపించారు. రేషన్‌కార్డులు, పింఛన్ల రద్దుతో 26 లక్షల పేద కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో లాక్కుంటున్నారని మండిపడ్డారు. అమ్మఒడి కింద ఒక్కో తల్లి నుంచి రూ.1000 చొప్పున వసూలు చేశారన్న యనమల..అమ్మఒడిలో ఏడాదికి రూ.5,220 కోట్లు లాక్కున్నారని తెలిపారు. సబ్ ప్లాన్ నిధులను 'అమ్మఒడి'కి మళ్లించారని ఆరోపించారు. పెట్టుబడులు రాక 4 లక్షల ఉద్యోగాలను యువత కోల్పోయిందని యనమల అన్నారు.
ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్నారు: యనమల - తెదేపా నేత యనమల తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వ పేదల పొట్టకొడుతోందని తెదేపా నేత యనమల ఆరోపించారు. రేషన్‌కార్డులు, పింఛన్ల రద్దుతో ఎన్నో పేద కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. పెట్టుబడులు రాక 4 లక్షల ఉద్యోగాలను యువత కోల్పోయిందన్నారు.
ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్నారు: యనమల