'స్పీకర్‌కు తెలియకుండానే ఎంపీ నిర్బంధమా?' - యనమల రామకృష్ణుడు న్యూస్
వైకాపా ప్రభుత్వ దౌర్జన్యకాండను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్ అరెస్టును ఆయన ఖండించారు.
వైకాపా ప్రభుత్వ దౌర్జన్యకాండను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు.ఎంపీ గల్లా జయదేవ్ అరెస్టును ఆయన ఖండించారు.ఎంపీని అక్రమంగా నిర్బంధించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించిన ఆయన..అరెస్టు చేస్తే24గంటల్లో లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని గుర్తు చేశారు.స్పీకర్‌కు తెలియకుండా,అనుమతి లేకుండా అరెస్టు చేస్తారా అని దుయ్యబట్టారు.పోలీసు వాహనంలో వందల కిలోమీటర్లు తిప్పుతారా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్,కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.జయదేవ్‌పై దౌర్జన్యం చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.