సెలక్ట్ కమిటీ దస్త్రాన్ని మళ్లీ వెనక్కి పంపటం ద్వారా అసెంబ్లీ కార్యదర్శిపై చర్యలు తీసుకునే అధికారం ఛైర్మన్ కు ఉంటుందని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కమిటీ ఏర్పాటును అడ్డుకునేలా ప్రభుత్వం అంతలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఆర్డీఏ రద్దు బిల్లు, రాజధానుల ఏర్పాటుపై మండలిలో సరైన సమాధానం ఇవ్వలేకపోయిందని విమర్శించారు. శాసనమండలి రద్దు అంశంపై త్వరలోనే దిల్లీకి తెదేపా ఎమ్మెల్సీలకు బృందం వెళుతుందని తెలిపారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
జప్తు చేసిన ఆస్తుల సంగతేంటి..?