TDP leader Yanamala: సీఎం జగన్ ఉత్తుత్తి పథకాలతో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైకాపా ప్రజాప్రతినిధులకు ఛీత్కారాలు, నిలదీతలే ఎదురవుతున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. వైకాపా వాళ్లు తమ ఇంటికి రావద్దంటూ ప్రజలు బోర్డులు పెట్టుకుంటున్నారని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పినందుకు నమ్మి ఓట్లేసిన ప్రజలను నిట్టనిలువునా మోసగించారు. ఇళ్లకు వస్తున్న వైకాపా నాయకులపై తిట్ల దండకంతో ప్రజలు చెలరేగిపోతున్నారు. మూడేళ్లుగా ఎమ్మెల్యేలను పట్టించుకోని జగన్‌రెడ్డి ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి నియోజకవర్గానికి రూ.2కోట్లు కేటాయించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రజాశ్రేయస్సును గాలికొదిలి అన్ని వర్గాల ఆగ్రహానికి గురయ్యారు’ అని యనమల ధ్వజమెత్తారు. పాడైన రహదారులు, తాగునీటి సమస్య, ఊసెత్తని ఉద్యోగాలు, అటకెక్కిన సీపీఎస్ రద్దు, ప్రాణాలు తీస్తున్న సర్కారు కల్తీ మద్యం.. ఇలా అనేక సమస్యలపై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైకాపా ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారని యనమల మండిపడ్డారు. ‘ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రం ఎలా బయటపడుతుందో ఆర్థిక నిపుణులకూ అంతుచిక్కట్లేదు. జగన్ పథకాల పేరుతో అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాలా తీయించే పనులు చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని మరింతకాలం భరించే పరిస్థితి లేదు’ అని రామకృష్ణుడు విమర్శించారు.
TDP leader Yanamala: గడప గడపకూ ఛీత్కారాలు.. నిలదీతలే:యనమల - తెదేపా నేత యనమల కీలక వ్యాఖ్యలు
TDP leader Yanamala: గడప గడపకు వెళ్లిన వైకాపా ప్రజాప్రతినిధులకు ప్రతిచోటా... నిలదీతలు, ఛీత్కారాలే ఎదురయ్యాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఇది వైకాపా అధిష్ఠానానికి జీర్ణించుకోలేనిదిగా మారిందన్నారు. నమ్మి ఓటేసినందుకు నిట్టనిలువునా మోసం చేశారని ప్రజల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చారని విమర్శించారు. మూడేళ్లలో స్వర్ణాంధ్రప్రదేశ్ ను జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని యనమల విమర్శించారు.
యనమల రామకృష్ణుడు