ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Yanamala: 'మాటలు పేదలకు, మూటలు వైకాపా నాయకులకా..?' - ఏపీ న్యూస్ అప్​డేట్స్

ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మాటలు పేదలకు, మూటలు వైకాపా నాయకులకు వెళ్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం ప్రైవేటు వ్యక్తులు, పాలించేవారికి వెళ్తోందని అన్నారు.

yanamala
yanamala

By

Published : Jun 14, 2021, 11:25 AM IST

'మాటలు పేదలకు, మూటలు వైకాపా నాయకులకు'

ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. ఏపీ పరిస్థితి దారుణంగా ఉందని.. మాటలు పేదలకు, మూటలు వైకాపా నాయకులకు వెళ్తున్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.

రాష్ట్ర ఆదాయం ప్రైవేటు వ్యక్తులు, పాలించేవారికి వెళ్తుండటంతో.. ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయని మండిపడ్డారు. కొవిడ్‌కు అసమర్థ పాలన తోడై.. సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోందని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details