'ఆర్థిక చక్రాన్ని రివర్స్ చేసి... ఆదాయ మార్గాలకు గండికొట్టారు'
తెలుగుదేశం పార్టీ సింగపూర్ నమూనా చేపడితే..... వైకాపా వెనిజులా నమూనా తెచ్చిందని ... యనమల రామకృష్ణుడు విమర్శించారు. పెట్టుబడులను తరిమేసి, ఆదాయాలను అడ్డుకొని, ఉపాధిని దెబ్బతీసి, ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి.... ప్రజలే తిరగబడి రోడ్లపైకి రావడమే వెనిజులా నమూనా అంటూ యనమల ఎద్దేవా చేశారు.
4నెలల్లో ఏపీలో తలసరి ఆదాయం17వేల రూపాయలు తగ్గినట్లు ప్రధానికి సీఎం జగన్ ఇచ్చిన వినతి పత్రమే బయటపెట్టిందని తెదేపా సీనియర్ నేత యనమల విమర్శించారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అధోగతికి తెచ్చారని....అది కనిపించకుండా చేసేందుకు మంత్రి బుగ్గన తాపత్రయపడుతున్నారని ఆక్షేపించారు.ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం తప్ప అన్ని రంగాల రాబడి పడిపోయిందన్న యనమల...మద్యం రేట్లు పెంచేసి పేదల రక్తం పీల్చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో మౌలిక వసతుల రంగాన్ని చావుదెబ్బతీశారని ఆరోపించారు.ఆర్థిక చక్రాన్నే రివర్స్ చేశారని...సామాన్యుడి ఆదాయ మార్గాలకు గండికొట్టారని యనమల ధ్వజమెత్తారు.