రాష్ట్రంలో రౌడీయిజాన్ని అధికార వైకాపానే పెంచి పోషిస్తోందని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మాదకద్రవ్యాలతో యువతను పెడదారి పట్టిస్తూ.. రౌడీదందాలతో సామాన్య వ్యాపారులను బెంబేలెత్తిస్తున్నారని మండిపడ్డారు. వాటాల కోసం బెదిరించి పరిశ్రమలను తరిమేశారని ఆరోపించారు. అన్నా క్యాంటీన్ల మూత, పండుగ కానుకల రద్దుతో పేదల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు.
పగలు, ప్రతీకారాలకు వైకాపా స్వస్తి పలకాలి: యనమల
రౌడీయిజాన్ని అధికార వైకాపానే పెంచి పోషిస్తోందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మాదకద్రవ్యాలతో యువతను పెడదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. వాటాల కోసం బెదిరించి పరిశ్రమలను తరిమేశారన్నారు. రౌడీదందాలతో సామాన్య వ్యాపారులు బెంబేలెత్తుతున్నారన్నారు.
పొట్టకూటి కోసం యువత మాఫియా ఉచ్చులో చిక్కుకుంటుందని, అధికార వైకాపా మాఫియా గ్యాంగులకు రక్షణ కవచంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం 24 శాతం పెరిగిందన్నారు. రాజకీయ కక్ష సాధింపులో ముఖ్యమంత్రి జగన్ మునిగి తేలుతున్నారని, ఇకనైనా పగలు, ప్రతీకారాలకు స్వస్తిచెప్పి పేదల సంక్షేమంపై జగన్ శ్రద్ద పెట్టాలని యనమల సూచించారు. మాఫియా గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపి, రౌడీయిజాన్ని అణిచివేయాలన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టి, ఉపాధి కల్పించి యువత భవిత కాపాడాలని యనమల కోరారు.
ఇదీ చదవండి;గవర్నర్, ఎస్ఈసీ మధ్య సంభాషణ లీక్.. హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ