సీబీఐ, ఈడీ కేసుల సత్వర విచారణకు సుప్రీంకోర్టు పూనుకోవడం శుభపరిణామమని.. శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. క్రిమినల్ కేసుల్లో విచారణ జాప్యం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని అభిప్రాయపడ్డారు. నేరస్తులకు శిక్ష పడినపుడే ఆదర్శవంతమైన సమాజాన్ని అందించగలమని అభిప్రాయపడ్డారు.
YANAMALA: 'క్రిమినల్ కేసుల్లో విచారణ జాప్యం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం'
సీబీఐ, ఈడీ కేసుల సత్వర విచారణకు సుప్రీం పూనుకోవడం శుభపరిణామమని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజకీయాల్లో నేరస్థులను నిలువరించినపుడే అసలైన ప్రజాస్వామ్యమని అభిప్రాయపడ్డారు.
yanamala rama krishnudu
రాష్ట్రంలో 138 సీబీఐ, ఈడీ కేసులు.. దశాబ్ద కాలంగా పెండింగులో ఉన్నాయని చెప్పారు. నేరస్తులు లేని రాజకీయాలతోనే రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతల నివారణ సాధ్యమన్నారు. చట్టం సామాన్యులకు ఒకలా రాజకీయ నేరస్తులకు ఒకలా తయారైందని, అందరికీ ఒకటే అని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని యనమల అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: