ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రశ్నించే గొంతును నొక్కేస్తే.... ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది' - సీఎం జగన్​పై యనమల విమర్శలు

ఏడాదిగా అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులకు, మహిళలకు శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు సంఘీభావం తెలిపారు. ప్రతిపక్షనేతల అరెస్టులను ఖండించారు.

TDP leader Yanamala
శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు

By

Published : Dec 17, 2020, 1:00 PM IST

రాజధాని పరిరక్షణ ఆందోళనలు ఏడాది సందర్భంగా అమరావతి బయలుదేరిన ప్రతిపక్షనేతల గృహ నిర్బంధాలను శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఖండించారు. గృహనిర్బంధాలు సీఎం జగన్‌మోహన్ ‌రెడ్డి పిరికితనానికి నిదర్శనమని....దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వైకాపా అణిచివేత చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా గర్హించాలన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందన్న యనమల... రాజధాని ఉద్యమం రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుతుందన్నారు. అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలకు యనమల సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులు, రైతుకూలీలు, మహిళల పోరాటంలో చిత్తశుద్ది ఉందన్న ఆయన... 13వేల గ్రామాలు, 3వేల వార్డుల ప్రజానీకం మద్దతు వారికి ఉంటుందన్నారు. మనోవేదనతో మృతిచెందిన 112మందికి నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details