ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అన్యాయాన్ని ప్రశ్నించినందుకే అమరావతి రైతులపై కేసులు' - దివ్యవాణి తాజా వార్తలు

రాష్ట్రంలో ఎస్సీలు, మైనార్టీలపై వరుసగా దాడులు జరుగుతున్నా...ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకే అమరావతి రైతులపై ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ కేసు పెట్టిందని విమర్శించారు.

అన్యాయాన్ని ప్రశ్నించినందుకే అమరావతి రైతులపై కేసులు
అన్యాయాన్ని ప్రశ్నించినందుకే అమరావతి రైతులపై కేసులు

By

Published : Nov 10, 2020, 5:43 PM IST

అన్యాయాన్ని ప్రశ్నించినందుకే అమరావతి రైతులపై ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ కేసు పెట్టిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్సీలు, మైనార్టీలపై వరుసగా దాడులు జరుగుతున్నా...ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదన్నారు. కృష్ణాయపాలెం, వెలగపూడి, మందడంలో రైతులు చేస్తున్న దీక్షకు దివ్యవాణి, తెదేపా నేత మనోహర్ నాయుడు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నమ్మి ఒక్క సెంటు భూమైనా...ఇచ్చే పరిస్థితి లేదని మనోహర్ నాయుడు వ్యాఖ్యానించారు.

మందడంలో రైతుల ఉద్యమానికి అమరావతి కళా చైతన్య వేదిక నాయకులు సంఘీభావం ప్రకటించారు. తుళ్లూరు, రాయపూడి, పెదపరిమి, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, అనంతవరంలో రైతులు దీక్ష శిబిరాలు కొనసాగించారు.

ABOUT THE AUTHOR

...view details