తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెదేపా నేత వేగేశన నరేంద్ర వర్మ ఆరోపించారు. తన మాజీ డ్రెవర్ ద్వారా కేసులు పెట్టించారన్నారు. డ్రెవర్ వీరేష్ తన వద్ద గత 7 సంవత్సరాలుగా పని చేసి సంవత్సరం క్రితమే మానేశాడని తెలిపారు.
నెలకు జీతం 15 వేలు జీతంతో పాటు, బోనస్ సైతం ఇచ్చేవాడినన్నారు. అప్పులు ఎక్కువ చేసేవాడనీ... అలా చేయవద్దని చెప్పినందుకే తన దగ్గర మానేశాడని తెలిపారు. తాను ఎవర్నీ బెదిరించలేదనీ... వీరేష్ కేసు పెట్టటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.