ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మీరు రాష్ట్రానికి హోంమంత్రి అని మరిచారా' - వర్ల రామయ్య

వైకాపా బాధితుల శిబిరాన్ని పరిశీలించి...వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర హోంమంత్రిపై ఉందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. వైకాపా కావాలనే తెదేపా శిబిరానికి పోటీగా పిడుగురాళ్లలో శిబిరం పెట్టిందన్నారు.

సుచరిత గారూ..మీరు రాష్ట్రానికి హోంమంత్రి అని మరిచారా..! : వర్ల రామయ్య

By

Published : Sep 7, 2019, 5:37 PM IST

సుచరిత గారూ..మీరు రాష్ట్రానికి హోంమంత్రి అని మరిచారా..! : వర్ల రామయ్య
హోంమంత్రి మేకతోటి సుచరిత రాష్ట్రానికి హోంమంత్రిగా వ్యవహరించడం లేదని.. కేవలం వైకాపాకు మాత్రమే హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. గుంటూరులో వైకాపా బాధితుల శిబిరం జరుగుతుంటే...వారికి ధైర్యం చెప్పి, రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వాల్సిన బాధ్యత హోంమంత్రికి లేదా అని ప్రశ్నించారు. తెదేపా శిబిరానికి పోటీగా పిడుగురాళ్లలో వైకాపా పెట్టిన శిబిరానికి హోంమంత్రి వెళ్లి పరామర్శించడం శోచనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన విధానం ఇదేనా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details