ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డిప్యూటీ సీఎం నారాయణస్వామిని బర్తరఫ్ చేయాలి'

ఎస్సీ వర్గానికి చెందిన మహిళ వైద్యురాలిపై దాడి అత్యంత హేయమని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కరవైందన్నారు.

tdp leader varla ramaiah
tdp leader varla ramaiah

By

Published : Jun 9, 2020, 3:11 AM IST

ఎస్సీ వర్గానికి చెందిన మహిళ వైద్యురాలిపై దాడి అత్యంత హేయమని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కరవైందని విమర్శించారు. డిప్యూటీ సీఎం వల్లే వేధింపులు అని మహిళా డాక్టర్ మొర పెట్టుకుందని స్పష్టం చేశారు.మూడు నెలల క్రితం కేసు పెట్టినా కఠిన చర్యలు ఎందుకు లేదని ప్రశ్నించారు. సీఎం వెంటనే అనిత కేసును కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు నారాయణ స్వామిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details