TDP LEADER VARLA: సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. చికోటి ప్రవీణ్ నేపాల్లో నిర్వహించిన క్యాసినోలో వేల కోట్ల రూపాయల హవాలా ధనం చేతులు మారినట్లు ఈడీ గుర్తించి సోదాలు జరిపిందన్నారు. నేపాల్ క్యాసినోకి రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్లారని.. అందులో సగం మంది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలున్నారని ఆరోపించారు.
'నేపాల్ క్యాసినోకి చాలామంది వెళ్లారు.. ఆ జాబితా ప్రభుత్వం బయటపెట్టగలదా?'
TDP LEADER VARLA: గుడివాడలో సంక్రాంతి సందర్భంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. అలాగే నేపాల్ క్యాసినోకి రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్లారని.. అందులో సగం మంది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలున్నారని ఆరోపించారు.
TDP LEADER VARLA
ఒక్కొక్కరి నుంచి ప్రవీణ్ రూ.3లక్షలు వసూలు చేసి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రం నుంచి నేపాల్ క్యాసినోకి వెళ్లిన వారి జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్యాసినోలో వైకాపా నేతలు బ్లాక్ మనినీ.. వైట్ మనీగా మార్చుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: