ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ ఎస్టీ కమిషన్​కు వర్ల రామయ్య లేఖ

యలమంద నాయక్‌కు జరిగిన అన్యాయంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జాతీయ గిరిజన కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్​కు లేఖలు రాశారు. అక్రమ కేసులతో వేధించిన స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

varla ramaiah letter to national commission for scheduled tribes
varla ramaiah letter to national commission for scheduled tribes

By

Published : Nov 16, 2020, 4:19 PM IST

జాతీయ ఎస్టీ కమిషన్​, జాతీయ మానవ హక్కుల కమిషన్​కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. గుంటూరు జిల్లా పల్నాడుకు చెందిన యలమంద నాయక్​కు అన్యాయం జరిగిందని.. అక్రమ కేసుల పేరుతో పోలీసులు వేధించారని పేర్కొన్నారు. పోలీసులు, రౌడీలు కలిసి కిడ్నాప్ చేశారని.. అక్రమంగా 10 రోజుల పాటు జైల్లో బంధించారని ఆరోపించారు. వెంటనే స్థానిక పోలీసులపైన, కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టిన దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details