ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Varla letter to DGP: మైనింగ్​ మాఫియా బాధితుడిపైనే కేసులా.. డీజీపీకి వర్ల రామయ్య లేఖ - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

Varla Ramaiah letter to AP DGP: ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడ ఆర్‌ఐ మీద కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. మైనింగ్ మాఫియా బాధితుడిపైనే కేసులేంటని ప్రశ్నించారు. రెవెన్యూ, గనుల శాఖ అధికారులు మౌనంగా సరికాదన్నారు.

Varla Ramaiah letter to AP DGP
ఏపీ డీజీపీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ

By

Published : Apr 28, 2022, 12:37 PM IST

Varla Ramaiah letter to AP DGP: మైనింగ్ మాఫియా బాధితుడైన గుడివాడ ఆర్‌ఐ అరవింద్‌పై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తూ.. తెలుగుదేశం నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపైనే కేసు నమోదు చేశారంటే మైనింగ్ మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తోందని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడి... రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మాఫియాను అరెస్ట్ చేయకుండా.. బాధితుడైన ఆర్​ఐపై కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. బాధితుడిపై కేసు నమోదు చేయడమంటే ప్రజల్లో పోలీసులపై నమ్మకం సన్నగిల్లేటట్లు చేయడమేనని పేర్కొన్నారు. పోలీసుల్లో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మొత్తం వ్యవస్థను నాశనం చేసేలా నేరగాళ్లను కాపాడుతున్నారని విమర్శించారు. రెవెన్యూ, గనుల శాఖ అధికారులు.. దీనిపై మౌనం వహించడంపై కారణాలు వారికే తెలియాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.

ఆర్​ఐపై కేసు:కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటురులో అక్రమ తవ్వకాల కేసు మరో మలుపు తిరుగుతోంది. రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ అరవింద్ లక్ష రూపాయల నగదు డిమాండ్ చేసినట్లు గంటా లక్ష్మణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా గుడివాడ రూరల్ పోలీసులు ఆర్ఐ పై 323, 506, 384, 511 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్రామస్తులు మట్టి కావాలని కోరగా తన స్థలంలోని మట్టిని తవ్వి వారికి పంపే విషయంపై ఆర్ఐతో మాట్లాడానని, మట్టిని తవ్వి, రవాణా చేసినందుకు తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఆర్​ఐ డిమాండ్ చేశారని, తాను ఏప్రిల్ 23న నగదు ఇస్తానని ఒప్పుకున్నట్లు గంటా లక్ష్మణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 21 అర్ధరాత్రి 11.45 గంటలకు మట్టిని తవ్వుతుండగా హఠాత్తుగా ఆర్ఐ అరవింద్ ఘటనా స్థలానికి వచ్చి నగదు డిమాండ్ చేశారని .. తమను భయపెట్టారని తెలిపారు. డబ్బులివ్వకపోతే తవ్వకాలను నిలిపివేయాలని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. తాను శనివారం నగదు ఇస్తానని ఆర్ఐ కి చెప్పినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. ఆర్ఐ ఉద్దేశపూర్వకంగానే సంఘటనా స్థలానికి వచ్చారని.. తనను బెదిరించారని గంటా లక్ష్మణ్ తెలిపారు. సంఘటన ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి జరగ్గా.. పోస్టు ద్వారా ఈ నెల 24న ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.


ఇదీ చదవండి: Attack on RI: అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న ఆర్​ఐపై దాడి

ABOUT THE AUTHOR

...view details