Varla Fires on YSRC Govt: రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయిలకు, నేరస్థులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఎవరిని సంతృప్తిని పర్చడం కోసం జొన్నలగడ్డలో తెదేపా నాయకుడు అరవింద్ బాబును పోలీసు అధికారి బూటు కాలితో తన్నారని మండిపడ్డారు. బూటు కాలితో తన్నిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని వర్ల డిమాండ్ చేశారు.
కొంత మంది పోలీసు అధికారులు అధికార పార్టీకి దాసోహాం అవుతున్నారని వర్ల మండిపడ్డారు. పార్టీ చేతిలో కీలు బొమ్మగా మారిన పోలీసు వ్యవస్థను కాపాడడానికి ఎవరో ఒకరు రావాలని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ సంక్రాంతి విద్యుత్ దీపాలతో వెలుగిపోతే.. అరవిందబాబు, మాచర్ల చంద్రయ్య, వినుకొండ రైతు నరేంద్ర ఇళ్లలో చీకట్లు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ ఘటనలో సీఐని సప్పెండ్ చేసి, కేసు దర్యాప్తు చేసిన ఎస్సైను ఎందుకు సప్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. కుల వివక్ష చూపించారా..? అని నిలదీశారు.