ఎస్సీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా.. వారి పైనే యుద్ధం ప్రకటించిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఎస్సీల ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యత పెంచే అమరావతి రాజధానిని కాల రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 299 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులను పట్టించుకోకపోవడం.. ఎంత వరకు న్యాయమో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఎస్సీ ఓట్లతో పీఠమెక్కి... వారిపైనే యుద్ధమా?' - వైసీపీపై వర్ల రామయ్య కామెంట్స్
ఎస్సీ ఓట్లతో అధికారం చేపట్టిన వైకాపా... ఇప్పుడు వారిపైనే దాడులు చేస్తోందని తెదేపా నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీల ఆర్థిక, సామాజిక ప్రాధాన్యత పెంచే అమరావతిని కాలరాస్తున్నారని అన్నారు. 299 రోజులుగా ఎస్సీ రైతులు ఉద్యయం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆయన ట్విట్టర్లో తప్పుబట్టారు.
varla ramaiah