ఇళ్ల పట్టాల అవినీతి వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు ఎప్పటికైనా జైలుకెళ్లడం ఖాయమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హెచ్చరించారు.
'సీబీఐ విచారణ జరిపితే.. మూడో వంతు మంత్రివర్గం ఖాళీ' - వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ కామెంట్స్
వైకాపా ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు జైలుకెళ్లే పరిస్థితులు వస్తాయని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపిస్తే మూడో వంతు కేబినెట్ ఖాళీ అవుతుందని విమర్శించారు.
varla ramaiah
జగన్ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపిస్తే.. మూడోవంతు మంత్రివర్గం ఖాళీ అవుతుందని, సగం మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్తారని విమర్శించారు. ఏపీలోని మందుబాబులు తెలంగాణకు వెళ్లి సీసాలు తెచ్చుకుంటారన్న భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రానికి బస్సులు నడపడం లేదని వర్ల దుయ్యబట్టారు.
ఇదీ చదవండి :రఘురామకృష్ణరాజుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా: నందిగం సురేశ్