ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెలగపూడి ఘటనలో వారిద్దర్ని అరెస్ట్ చేయాలి: వర్ల రామయ్య - వర్ల రామయ్య వార్తలు

వెలగపూడి ఘటనలో జోక్యం చేసుకున్న హోంమంత్రి భర్త దయాసాగర్, నెల్లూరులో ఎస్​గా పనిచేస్తున్న వెంకటరమణపై.. హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని అన్నారు.

tdp leader varla ramaiah
tdp leader varla ramaiah

By

Published : Dec 29, 2020, 9:44 PM IST

వెలగపూడి ఘటనకు ఆధిపత్య పోరే కారణమని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఎంపీ గొప్పా, ఎమ్మెల్యే గొప్పా అనే వాదనతో ప్రారంభమైన వివాదం రెండువర్గాల మధ్య గొడవకు దారి తీసిందని మండిపడ్డారు. వివాదంలోకి హోంమంత్రి భర్త దయాసాగర్, నెల్లూరులో ఎస్​ఐగా పని చేస్తున్న తురకా వెంకటరమణ జోక్యం చేసుకోబట్టే...అది కాస్తా తారాస్థాయికి చేరిందన్నారు.

వెలగపూడి ఘటనలో కీలకంగా వ్యవహరించిన దయాసాగర్, వెంకటరమణలపై.. హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా సీఎం ఏకపక్షంగా వ్యవహారిస్తే..ఆ ఘటనలు ఆయన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయని చెప్పారు. తెదేపా ఎప్పుడూ న్యాయం, ధర్మం,చట్టం వైపే ఉంటుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details