రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. డీజీపీ సవాంగ్ ఓ పార్టీకి ఎందుకు వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు పని చేసేది ప్రభుత్వ ఆధ్వరంలో కాదా అని నిలదీశారు. చంద్రబాబును రామతీర్థం కొండ దగ్గరకు వస్తున్నప్పుడే ఎందుకు ఆపలేదన్నారు. ప్రతి వివాదంలోనూ విజయసాయిరెడ్డి ఎందుకు తలదూరుస్తున్నారని దుయ్యబట్టారు.
నిత్యం చంద్రబాబును అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. రామతీర్థం వద్ద శాంతిభద్రతలు ఎందుకు అదుపు తప్పాయని? ఆక్షేపించారు. ఏ పని చేయొచ్చో.. చేయకూడదో సీఎంకు డీజీపీ చెప్పాలని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.