ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జైలులో ఉన్న న్యాయమూర్తి రామకృష్ణకు ప్రాణహాని: వర్ల రామయ్య - judge ramayya latest news

చిత్తూరు జిల్లా జైలులో ఉన్న జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై.. చిత్తూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్​కు సందేశం పంపారు.

varla on judge ramakrishna
varla on judge ramakrishna

By

Published : May 29, 2021, 10:28 PM IST

చిత్తూరు జిల్లా జైలులో ఉన్న న్యాయమూర్తి రామకృష్ణకు ప్రాణ హాని ఉందంటూ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సందేశం పంపారు. మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వెళ్తే ప్రాణాలు పోతాయంటూ సహచర ఖైదీ తన తండ్రిని బెదిరిస్తున్నాడని జడ్జి తనయుడు వంశీ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. జిల్లా జైలులో గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా వంశీ భయపడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై చర్యలు తీసుకుని .. రామకృష్ణ ప్రాణాలు కాపాడాని తన సందేశం లో కోరారు.

ABOUT THE AUTHOR

...view details