ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vangalapudi Anitha: ఎన్​హెచ్​ఆర్సీకి వంగలపూడి అనిత లేఖ.. ఎందుకంటే - ఎన్​హెచ్​ఆర్సీకి లేఖ రాసిన వంగలపూడి అనిత

Vangalapudi Anitha: జాతీయ మహిళా, మానవ హక్కుల కమిషన్‌కు వంగలపూడి అనిత లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు.

TDP leader Vangalapudi Anitha
వంగలపూడి అనిత

By

Published : Mar 11, 2022, 7:10 AM IST

Vangalapudi Anitha: జాతీయ మహిళా, మానవ హక్కుల కమిషన్‌కు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. మహిళకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. మహిళలకు భద్రత కల్పించేలా చర్యలుండాలని అనిత లేఖలో కోరారు.

అసలేం జరిగిందంటే...

నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన విదేశీ పర్యాటకురాలిపై అత్యాచారయత్నం కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ పోలీసులు… గూడూరు సమీపంలోని చిల్లకూరు జంక్షన్‌ వద్ద నిందితులను పట్టుకున్నట్లు సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. లిథువేనియా దేశానికి చెందిన మహిళ(27) చెన్నై నుంచి బెంగళూరు మీదుగా గోవాకు వెళ్లేందుకు బస్సులో బయలుదేరారు. బస్సులో విదేశీ కరెన్సీ చెల్లని నేపథ్యంలో మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాళేనికి చెందిన ఇంగిలాల సాయికుమార్‌ అనే యువకుడు కండక్టర్‌కు రూ.720 చెల్లించి బస్సులో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె నుంచి రూ.5 వేలు తీసుకొని.. ఆ మొత్తాన్ని స్వగ్రామంలో ఇస్తానని నమ్మించి తన వెంట వెంకన్నపాళెం తీసుకువచ్చాడు. కుటుంబసభ్యులు మందలించడంతో మహిళ భోజనం తిన్నాక పంపిస్తానని చెప్పాడు.

పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన కరోలినా...

భారత్​ చూద్దామని వచ్చా.. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని విదేశీ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. చెన్నై నుంచి గోవాకు వెళ్తుండగా సాయి కుమార్ పరిచయమయ్యాడని తెలిపిన ఆమె... అతని మిత్రుడితో అఘాయిత్యానికి ప్రయత్నించాడని వాపోయింది. స్థానికుల సహకారంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు పేర్కొంది. తనకు పోలీసులు సహాయం చేశారని... వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేశారని పేర్కొంది. ఈ సందర్భంగా కరోలినా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

4 గంటల్లోనే నిందితులు అరెస్టు...

సాయికుమార్‌ తన మిత్రుడైన గూడూరు ప్రాంతానికి చెందిన షేక్‌ అబీద్‌కు విదేశీ మహిళ గురించి చెప్పాడు. వారిద్దరూ ద్విచక్ర వాహనంపై సైదాపురం ప్రాంతంలో పలు ప్రదేశాలను చూపించారు. అక్కడ నుంచి రాపూరు వెళ్లే మార్గమధ్యలో సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అత్యాచారయత్నానికి పాల్పడగా ఆమె ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేస్తూ రోడ్డుపైకి చేరుకున్నారు. వాహనదారులు మహిళ పరిస్థితిని గుర్తించి వెంటనే సైదాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమె సెల్‌ఫోన్‌లోని వీడియో, సాయికుమార్‌ ఆధార్‌, పాన్‌కార్డు ఆధారంగా నిందితులను గుర్తించారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన 4 గంటల్లోనే నిందితులను గూడూరు సమీపంలోని చిల్లకూరు జంక్షన్‌ వద్ద పట్టుకున్నట్లు సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

విదేశీ మహిళపై అత్యాచారయత్నం.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details