ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP: నిత్యవసరాల ధరల పెంపునకు వ్యతిరేకంగా.. రేపు తెదేపా నిరసన కార్యక్రమాలు..

రాష్ట్రంలో పెరిగిన నిత్యవసరాల ధరలకు వ్యతిరేకంగా గురువారం తెదేపా(tdp) నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోకుంటే త్వరలోనే ముఖ్యమంత్రి ఇంటిని తెలుగు మహిళలు ముట్టడిస్తారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు.

tdp leader vangalapudi anitha
tdp leader vangalapudi anitha

By

Published : Jul 21, 2021, 7:39 PM IST

రాష్ట్రంలో పెరిగిన నిత్యవసరాల ధరలకు నిరసనగా గురువారం అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రకటించారు. ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోకుంటే త్వరలోనే ముఖ్యమంత్రి ఇంటిని తెలుగు మహిళలు ముట్టడిస్తారని హెచ్చరించారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై ప్రభుత్వం మోపిన పన్నులు, నిత్యావసరాల ధరల పెంపు గుదిబండలా మారిందన్నారు. గ్యాస్ ధరలతో పాటు అన్ని రకాల వస్తువుల ధరలు, ఛార్జీలు పెరిగి.. మహిళల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయని తెలిపారు.

ధరల పెరుగుదలతో ఇళ్లు గడపటం ఎలా అని మహిళలు తలపట్టుకుంటున్నారని వంగలపూడి అనిత అన్నారు. నెలకు రూ.10వేల లోపు జీతంపై బతికే సామాన్యుల పరిస్థితి దుర్భరంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. అమ్మఒడి పేరుతో ఇచ్చే రూ.15వేలు నిత్యావసరాలకే సరిపోని దుస్థితి నెలకొందని వంగలపూడి అనిత ఆక్షేపించారు.

ఇదీ చదవండి:

Night curfew: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details