కొడాలి నానిపై కేసుల నమోదుతో సరిపెట్టకుండా మానసిక చికిత్స అందించాలని తెదేపా అధికార ప్రతినిధి ఎన్.బి. సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విపరీత మనస్తత్వంతో ప్రవర్తిస్తున్న కొడాలి నాని సైకోసిస్ లేదా ఉన్మాదం రుగ్మతతో బాధ పడుతున్నట్టుందని విమర్శించారు. ఎక్కువగా బూతులు మాట్లాడటం, వివేకరహితంగా ప్రవర్తించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సహజంగా మానసిక రుగ్మతలు ఉన్నవారు, తాగుబోతులు, వ్యసనపరులే ఇలా వ్యవహరిస్తారని తెలిపారు. కేసులు పెట్టి శిక్షలు విధిస్తే ఈ మానసిక రుగ్మతలు తగ్గవని వెల్లడించారు.
'కేసులు నమోదే కాదు.. మానసిక చికిత్స కూడా అందించాలి' - Tdp Leader sudhakar reddy comments on kodali nani
మంత్రి కొడాలి నానికి మానసిక చికిత్స అందించాలని తెదేపా అధికార ప్రతినిధి ఎన్.బి.సుధాకర్ రెడ్డి అన్నారు. కేసులు పెట్టి శిక్షలు విధిస్తే ఈ మానసిక రుగ్మతలు తగ్గవన్నారు.
తెదేపా అధికార ప్రతినిధి ఎన్.బి.సుధాకర్ రెడ్డి