ఎస్ఈసీ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకంలోకి నెట్టిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ విషయంలో ప్రభుత్వ వాదన నమ్మదగినదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఇది స్పష్టమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలతో ఆటలాడవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించటంతోనే ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని అన్నారు.
'ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయింది' - tdp leader somireddy comments on supreme court sec verdict news
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో సుప్రీం తీర్పుతో ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ సంస్థల విషయంలో నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే భంగపాటు తప్పదని మరోసారి రుజువైనట్లు ఆయన స్పష్టం చేశారు.
'ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయింది'