నంద్యాల ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. పోలీసుల కిరాతకం కారణంగానే సలాం కుటుంబం బలైపోయిందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వంలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు పూర్తిగా ఎమ్మెల్యేల చేతుల్లో చేరి నిర్వీర్యమయ్యాయని ధ్వజమెత్తారు. కలెక్టర్, ఎస్పీలు నిస్సహాయులుగా మిగిలిపోయారని సోమిరెడ్డి ఆరోపించారు. పోలీసులపై చర్యలకు హోంమంత్రి ధైర్యం చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
నంద్యాల ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి: సోమిరెడ్డి - తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి న్యూస్
నంద్యాల ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. పోలీసుల ఒత్తిడితోనే సలాం కుటుంబం బలైపోయిందన్నారు. ఎవరో కేసు పెడితే రుజువు కాకుండానే వేధిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఏపీలో కొందరు పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
tdp leader