ప్రభుత్వానికి రెండే ప్రత్యామ్నాయాలు: సోమిరెడ్డి - ప్రభుత్వానికి రెండే ప్రత్యామ్నాయాలు : సోమిరెడ్డి
పోలవరం విషయంలో ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని...ఒకటి పోలవరం అథారిటీ చెప్పినట్లు నడుచుకోవడం లేదా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కేంద్రానికి అప్పజెప్పడమేనని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
పోలవరం విషయంలో ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఒకటి పోలవరం అథారిటీ చెప్పినట్లు నడుచుకోవడం లేదా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కేంద్రానికి అప్పజెప్పడమేనని తెలిపారు. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లి రాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు తీసుకురావాలే తప్ప...ఉన్న ప్రాజెక్ట్‌లను నిలుపుదల చేసేందుకు వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆందోళన చూసైనా అమరావతి మార్పు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
TAGGED:
పోలవరం