అమరావతి ప్రాంత రైతుల త్యాగాలు వృథా కాకూడదంటే.. రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని.. తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధానిలో అన్ని మతాలు, కులాల వారున్నారన్నారు. అమరావతి తరలించడం ఎవరికీ సాధ్యపడదని స్పష్టంచేశారు. ల్యాండ్ పూలింగ్ చట్టం రైతులకు అనుకూలంగా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వంతో అన్నదాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. త్యాగాలు చేసిన వారు ఎప్పుడూ మోసపోరని.. వారిని ఎవరూ మోసం చేయలేరని ఉద్ఘాటించారు. అవసరమైతే రైతులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని వెల్లడించారు.
'రైతుల త్యాగం వృథా పోదు.. అమరావతి ఎక్కడికీ తరలదు' - రాజధానిపై ప్రత్తిపాటి పుల్లారావు స్పందన
రాజకీయాలకు అతీతంగా రైతులు, నేతలంతా ఆందోళనకు సిద్ధం కావాలని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. తమ భూములు త్యాగం చేసిన అమరావతి అన్నదాతలను ఎవరూ మోసం చేయాలేరని ఉద్ఘాటించారు.
ప్రత్తిపాటి పుల్లారావు