తెదేపా నేతలు, వారి కుటుంబసభ్యులపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టిందని మాజీమంత్రి పీతల సుజాత ఆరోపించారు. నాడు ఇదే తరహాలో తెదేపా వ్యవహారిస్తే... ఇవాళ జగన్కు అధికారం దక్కేదా..? అని ప్రశ్నించారు. పితాని సత్యనారాయణను ఎదుర్కొనే సాహసం చేయలేక ఆయన కుటుంబసభ్యులను ఇరికించడానికి వైకాపా కుట్ర పన్నుతోందని విమర్శించారు. ప్రజాసంక్షేమం గాలికొదిలేసి తప్పుడు కేసులతో ప్రతిపక్షాలను దెబ్బకొట్టడం సరికాదని... ఇలాంటి చర్యలను మానుకోవాలని ఆమె హితవు పలికారు.
నాడు కక్షసాధింపు చర్యలకు దిగితే జగన్కు అధికారం దక్కేదా..? - satyanarayana pithani
పితాని సత్యనారాయణను ఎదుర్కొనే సాహసం చేయలేకే ఆయన కుటుంబసభ్యులపై వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీమంత్రి పితల సుజాత ఆరోపించారు. మాజీమంత్రి పితానిని ఆయన స్వగ్రామంలో ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.
tdp leader pithala sujatha