ముఖ్యమంత్రి జగన్ ఒక కంటితో దేవాలయాలపై దాడులు నిరోధించాలని చెబుతూనే మరో కంటితో ప్రోత్సహిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. జగన్ లౌకికవాది అయితే హిందూ ధర్మాన్ని అవహేళన చేసిన కొడాలి నానిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. వరుస దాడులను పట్టించుకోని వెల్లంపల్లిని మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించలేదని నిలదీశారు. ముఖ్యమంత్రి ఓ మతానికి కొమ్ముకాయబట్టే ఆలయాలపై దాడులు సాధారణమయ్యాయని విమర్శించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన జగన్...ఓ కులానికో, ఓ మతానికో కొమ్ముకాయటం సరికాదన్నారు.
జగన్ లౌకికవాది అయితే కొడాలి నానిపై చర్యలేవి: మాణిక్యరావు - pilli manikyala rao fiers on cm jagan latest news
సీఎం జగన్పై తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ఒకవైపు దాడులను ఆపాలంటూనే ముఖ్యమంత్రి మరోవైపు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వరసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోని వెల్లంపల్లిని కేబినెట్ నుంచి ఎందుకు తొలగించటం లేదని ప్రశ్నించారు.
tdp leader pilli manikyala rao