Payyavula Keshav : పెగాసస్ వ్యవహారంలో వైకాపా ప్రభుత్వం కొండను తవ్వి.. దోమను కూడా పట్టలేదని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతుందని.. దమ్ముంటే ఈ కేసు విచారణను సుప్రీంకోర్టుకు ఇవ్వాలని సవాల్ విసిరారు. పెగాసస్‌పై తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేకుండా హౌస్ కమిటీ వేశారని.. చరిత్రలో ఇలాంటి కమిటీ లేదని మండిపడ్డారు.
తెదేపా పెగాసస్ వాడినట్లు నిరూపించలేకపోయారు: పయ్యావుల
Payyaula on Pegasus : తెలుగుదేశం పార్టీ పెగాసస్ వాడినట్లు నిరూపించలేకపోయారని.. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. పెగాసస్‌పై తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేకుండా హౌస్ కమిటీ వేశారని.. చరిత్రలో ఇలాంటి కమిటీ లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.
పెగాసస్ జరిగిందా లేదా అనే ఒక్క పదం కూడా ఎక్కడా లేదని దుయ్యబట్టారు. పెగసస్ వాడినట్లు అనుమానం ఉందని కూడా నివేదికలో చెప్పలేకపోయారన్నారు. గడప గడపకు వెళ్తున్న వైకాపా ప్రభుత్వం డేటా దొంగిలిస్తోందని ఆరోపించారు. నివేదిక బయటకు రాకుంటే ఎదో జరిగిపోయిందని చెప్పేవారని విమర్శించారు. భూమన ఇచ్చిన నివేదిక చూస్తే ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి ఉందో అర్థమైందని.. లేనిది ఉన్నట్లు చెప్పాలనే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం చెప్తే ఎన్నికల కమిషన్ ఓట్లు తొలగిస్తుందా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: