ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pattabi: 'అమరావతిలో భూ దోపిడీ అంటూ.. మళ్లీ ఆవు కథ మొదలు' - అమరావతిపై పట్టాభి కామెంట్స్

ఎమ్మెల్యే ఆళ్ల, వైకాపా నేతలు గత రెండేళ్లలో అమరావతిలో దోపిడీకి సంబంధించి ఒక్క ఆధారాన్నైనా చూపించారా? అని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి నిలదీశారు. అమరావతిలో భూ దోపిడీ అంటూ వైకాపా నేతలు మళ్ళీ ఆవుకథ మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు.

Pattabi
Pattabi

By

Published : Jul 4, 2021, 6:21 PM IST

పట్టాభి

అమరావతిలో భూ దోపిడీ అని వైకాపా నేతలు మళ్ళీ ఆవుకథ మొదలుపెట్టారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఆళ్ల, వైకాపా నేతలు గత రెండేళ్లలో అమరావతిలో దోపిడీకి సంబంధించి ఒక్క ఆధారాన్నైనా చూపించారా? అని నిలదీశారు. 63 వేల 410 ప్లాట్లు తెదేపా ప్రభుత్వంలో భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చామని పట్టాభి గుర్తు చేశారు.

రైతులకు తప్ప బినామీలకు ఒక ప్లాట్ ఇచ్చినట్లు వైకాపా నేతలు రుజువు చేయగలరా? అని సవాల్ విసిరారు. దళితుల భూములను దోచింది వైకాపా ప్రభుత్వమేనని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే అర్హత వైకాపా నేతలకు లేదని మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్ని కుట్రలు చేసినా.. తెదేపాపై బురద చల్లడం సాధ్యం కాదన్నారు. వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి 15 వేల కోట్ల బాక్సైట్ దోపిడి చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details