ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరతపై ప్రధానికి ట్వీట్లు పెట్టకుండా హేమంత్ సోరెన్ ట్వీట్ పై స్పందించటమేంటని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు. ప్రధానికి పల్లకీ మోయాల్సిన అవసరమేంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
"జగన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పెండింగ్ లో ఉన్నందనే సాష్టాంగ పడిపోతున్నారు. తన బెయిల్ రద్దైతే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే సంబంధంలేని వ్యవహారాల్లో ప్రధానికి మద్దతుగా సీఎం జోక్యం చేసుకుంటున్నారు. కొవిడ్ నియంత్రణలో నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ మంది చనిపోవటానికి కారణమైన జగన్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి. ముఖ్యమంత్రిగా బాధ్యత మర్చిపోయి సైకోలా వ్యవహరిస్తున్నారు." అని మండిపడ్డారు.