తనపై దాడి చేయించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని... కొంత మంది రౌడీలను సిద్ధం చేసుకుని పథక రచన చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. తాను దాడులకు భయపడనని స్పష్టం చేశారు. తెదేపా తనకు అండగా ఉందన్న ఆయన... ఏ చిన్న హానీ జరిగినా మంత్రిదే బాధ్యత అని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రేషన్ పంపిణీ వాహనాల్లో అవినీతి జరిగిందని పట్టాభి ఆరోపించారు.
'నాపై దాడికి మంత్రి కొడాలి నాని రౌడీలను సిద్ధం చేశారు' - minister kodali nani latest news
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి. తనపై దాడి చేయించేందుకు మంత్రి పథకం రచిస్తున్నారని అన్నారు. తనకు ఏ చిన్న హాని జరిగినా కొడాలి నానిదే బాధ్యత అని చెప్పారు. మరోవైపు రేషన్ వాహనాల్లో అవినీతి జరిగిందని పట్టాభి ఆరోపించారు.
వైకాపా సర్కార్ రేషన్ వ్యవస్థను నాశనం చేసింది. రేషన్ సరుకు రవాణా కోసం తీసుకువచ్చిన కొత్త వాహనాలు అసలు ఉపయోగపడవు. సరుకు రవాణా కోసం డీజిల్ వాహనాలు కొనుగోలు చేస్తారు. కానీ కమిషన్ కోసమే పెట్రోల్ వాహనాలు కొనుగోలు చేశారు. వాహనాల పేరుతో బడుగు, బలహీన వర్గాల నోట్లో మట్టి కొడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 16 వేల రూపాయల్లో పెట్రోల్, సహాయకుడు, బ్యాంకు కిస్తీలు ఎలా కడతారు. వాహనదారులకు గిట్టుబాటు కాక రేపు రేషన్ బియ్యం కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది- కొమ్మారెడ్డి పట్టాభి, తెదేపా అధికార ప్రతినిధి
ఇదీ చదవండి:ఎస్‌ఈసీతో సమావేశానికి పంచాయతీరాజ్ అధికారుల గైర్హాజరు