Tdp leader pattabhi on kodali nani: పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని బియ్యం దొంగగా మారి.. పేదల తిండి బొక్కేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. ఎమ్మెల్యేలు ద్వారంపూడి, సామినేని ఉదయభానుతో కలిసి మంత్రి కాకినాడ పోర్టు ద్వారా అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న బ్లాక్ మార్కెట్ కారణంగానే నిత్యావసరాల ధరలు పెరిగాయని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదని, నిత్యావసరాలు పెరిగాయని మంత్రే స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. పేదలకు తిండి అందక పస్తులుంటున్నారని మీడియా సాక్షిగా అంగీకరించారని స్పష్టం చేశారు.