రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, కొవిడ్ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు లెక్కలు చెప్పి పరిహారం చెల్లింపుల నుంచి పారిపోతోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు.
'కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి..' - pathabhi comments on cm jagan
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, కొవిడ్ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు లెక్కలు చెప్పిందని ఆరోపించారు.
tdp leader pattabhi
ఆక్సిజన్ అందక చనిపోయిన వారు ఎవ్వరూ లేరని రాజ్యసభలో కేంద్ర, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ కుమార్ సమాధానమివ్వటం ఆశ్చర్యం కలిగించిందని పట్టాభి అన్నారు. హృదయవిదాకర ఘటనలెన్నో రాష్ట్రంలో చోటుచేసుకుంటే.. కేంద్రానికి ప్రభుత్వం తప్పుడు నివేదికలు పంపటం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: