ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సుప్రీం తీర్పుతో రాజారెడ్డి రాజ్యాంగానికి కాలం చెల్లింది'

ఎసీఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వైకాపా.. రాష్ట్రం పరువు తీసిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. రాజ్యాంగ సంస్థలతో ఆటలొద్దని తీవ్ర వ్యాఖ్యలు చేసిందని ఆయన పేర్కొన్నారు. సుప్రీం తీర్పునకు బాధ్యత వహిస్తూ జగన్​ సీఎం పదవికి రాజీనామా చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు.

తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

By

Published : Jun 10, 2020, 4:45 PM IST

దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీఎం జగన్ రాష్ట్రం పరువు తీశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. ఎస్​ఈసీ ఆర్డినెన్స్​ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరించడాన్ని...ఆయన గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేరుగా వ్యాజ్యంపై విచారణ చేశారన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగ సంస్థలలో ఆటలాడొద్దని హెచ్చరించినట్లు పట్టాభి తెలిపారు.

ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హతను జగన్ కోల్పోయారన్న పట్టాభి... రాజ్యాంగంపై ఏమాత్రం విలువున్నా తక్షణమే సీఎం పదవికి జగన్​ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలో అమలవుతున్న రాజారెడ్డి రాజ్యాంగానికి కాలం చెల్లిందని ఆక్షేపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయటం మునుపెన్నడూ లేదని పట్టాభి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details