రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచులన్నీ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌కు ఎందుకు కట్టబెట్టారని తాము ప్రశ్నిస్తే.. మంత్రి పెద్దిరెడ్డి ఎందుకు ముఖం చాటేశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు. బండారం బయటపడేసరికి సంబంధిత మంత్రి ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి మీడియా ముందుకు వచ్చి తామడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
"ఇసుక రీచ్‌ల్లో క్విడ్ ప్రోకో జరిగిందని మేం ఆధారాలతో సహా బయటపెడితే... మంత్రి బయటకు రాకపోగా టెండర్లు ఖరారు చేసి 24 గంటలు గడవకుండానే టన్ను ఇసుకపై రూ.100 పెంచేశారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి లారీ ఇసుకపై అదనంగా 5 వేల వరకూ ధర పెంచేసి ప్రజలకు ఏం లాభం చేశారు? వీటికి రవాణా ఛార్జీలు, హ్యాండ్లింగ్ ఛార్జీలు, జె ట్యాక్స్ అదనంగా భరించాల్సి వస్తోంది. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి వేల కోట్ల రూపాయలు జేబులు నింపుకొనేందుకు పేదల పొట్ట కొట్టారు. పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ప్రజలకు ఇంకా చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేసి తన డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. సీఎం జగన్ ఏది దొరికితే అది హోల్ సేల్‌గా కొట్టేసేందుకు అలవాటు పడ్డారు" అని పట్టాభి మండిపడ్డారు.
'ద్వివేది సమాధానం దాటవేశారు'