ప్రజలు ప్రభుత్వానికి చివాట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసి ..స్థానిక ఎన్నికల నుంచి వైకాపా పారిపోతోందని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి దుయ్యబట్టారు. కొవిడ్‌ను సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయమని చెబుతున్న ప్రభుత్వ పెద్దలకు.. పాఠశాలలు, మద్యం దుకాణాలు తెరిపించినప్పుడు మహమ్మారి గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. ఎస్ఈసీ రాజ్యంగబద్ధమైన నిర్ణయంపై మంత్రులు ఎదురు దాడికి దిగడం హేయమని మండిపడ్డారు.
సర్కారు నమ్మక ద్రోహానికి ప్రజలు గుణపాఠం చెబుతారు: పట్టాభి - తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ న్యూస్
ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి ప్రజలు గుణపాఠం చెబుతారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. గతంలో ఎన్నికలు పెట్టమని.. ఇప్పుడు వద్దనడం పిరికితనమేనన్నారు. ఓటమి భయంతోనే జగన్ వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.
![సర్కారు నమ్మక ద్రోహానికి ప్రజలు గుణపాఠం చెబుతారు: పట్టాభి tdp leader pattabhi comments](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9590692-499-9590692-1605771597184.jpg)
tdp leader pattabhi comments