పీడీ అకౌంట్స్‌లో ఉన్న 41వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేకపోయినందున సర్దుబాటు చేశామని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన వివరణపై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంటే అంత పెద్ద మొత్తంలో నిధులు ఖజానాలో ఎలా పెట్టుకున్నారని నిలదీశారు. ఆర్థికశాఖలో ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఏ కాంట్రాక్టర్‌కు దోచిపెట్టారో లెక్కలు తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డి, సత్యనారాయణ అనే అధికారిని ఆర్థికశాఖలో రబ్బర్ స్టాంపులా పెట్టుకుని.. కావాల్సిన వారికి నిధులు దోచిపెడుతున్నారని పట్టాభిరామ్ ఆరోపించారు.
'ప్రభుత్వ ఖజానాలో నిధులు ఉంటే.. అప్పు ఎందుకు తెచ్చారు..?'
పీడీ అకౌంట్స్‌లో ఉన్న 41వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేకపోయినందున సర్దుబాటు చేశామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన వివరణపై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థికశాఖలో ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు.
tdp leader pathbhi comments on ysrcp government on fainacial issue
'ప్రభుత్వ ఖాతాల్లో రూ.41వేల కోట్లు ఉంటే రూ.లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల లెక్కలపై లోతైన విచారణతో పాటు ప్రత్యేక ఆడిటింగ్ జరిగి తీరాలి. కేంద్ర ఆర్థిక సంస్థలు దీనిపై జోక్యం చేసుకోవాలి' - పట్టాభి
ఇదీ చదవండి:
kollu arrest: మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం.. కొల్లు రవీంద్ర అరెస్ట్!
Last Updated : Jul 10, 2021, 3:46 PM IST