వైకాపాపై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పాదయాత్రకు మూడేళ్లwన సందర్భంగా చేయాల్సింది ఉత్సవాలు కాదన్నారు. అభివృద్ధిని ఆపినందుకు కర్మకాండలు పెట్టాలని దుయ్యబట్టారు. జగన్ పాలనలో సంక్షేమం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక.. ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు.
'జగన్ సీఎం అయ్యారు.. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది' - వైకాపా పది రోజుల ఉత్సవాలు
జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెదేపా నాయకురాలు పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. జగన్ పాదయాత్రకు మూడేళ్లంటూ ఉత్సవాలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.
tdp leader panchumarthi anuradha