ప్రచార ఆకాంక్షతో మంత్రులు, ప్రజా ప్రతినిధులే కరోనా బారిన పడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆర్భాటంగా ప్రారంభించిన అంబులెన్సులు ఏమయ్యాయన్న ఆమె.. చనిపోయిన వారిని జేసీబీలతో తరలించడం ఏంటని నిలదీశారు. కరోనా వ్యాప్తి నివారణ దృష్ట్యా.. ప్రజలు గుమికూడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. అయినా మద్యం దుకాణాలు తెరవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
జే-ట్యాక్స్ పేరుతో నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అనురాధ మండిపడ్డారు. కేంద్రం నిధులు ఎంత వచ్చాయి.. ఎంత ఖర్చు చేశారనే దానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.