ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దాడులు, కక్షలు, వేధింపుల చుట్టూ ప్రభుత్వ పాలన' - TDP Leader nimmala ramanaidu fire on police

సలాం కుటుంబ ఆత్మహత్య ఘటనపై పోరాడుతున్న ముస్లిం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని తెదేపా నేతలు ఖండించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ప్రభుత్వానికి అలవాటైందని పార్టీ శాసనసభాపక్ష ఉప నేత రామానాయుడు ఆరోపించారు.

TDP Leader nimmala ramanaidu
తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు

By

Published : Dec 3, 2020, 10:04 AM IST

తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు

ముస్లిం నేతల నిర్భంధంపై తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన.. దాడులు, కక్షలు, వేధింపుల చుట్టూ సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, పోరాడితే అక్రమంగా అరెస్ట్​లు చేయటం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. నేరస్తులు రోడ్లపై తిరుగుతుంటే.. న్యాయం కోరే వాళ్లు మాత్రం జైలుపాలయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ వైఖరిని శాసనసభలో ఎండగడతామని స్పష్టం చేశారు.

సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముస్లిం సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన అధికారులు ముస్లిం సంఘాల నాయకులను ఎక్కడికక్కడ నిర్భందించారు. ఇలాంటి వైఖరి సరికాదని తెదేపా నేతలు తప్పుబట్టారు.

ఇవీ చూడండి...

'ప్రైవేటు భూముల కొనుగోళ్లను నేరంగా పరిగణించడం ఏమిటి?'

ABOUT THE AUTHOR

...view details