బూతులు, అవాస్తవాలు మాట్లాడినట్లు నిరూపిస్తే తాను అసెంబ్లీకి వెళ్లనని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ చేయూత పథకం విషయంలో గతంలో జగన్ చెప్పిన విషయాలనే తాను సభలో ప్రస్తావించానని తెలిపారు. నిజాలు చెబితే సభను తాను తప్పు దోవ పట్టించానని ఎలా విమర్శిస్తారని రామానాయుడు మండిపడ్డారు.
'నిరూపిస్తే అసెంబ్లీకి రాను'... నిమ్మల సవాల్ - నిమ్మల రామానాయుడు తాజా వార్తలు
బూతులు, అవాస్తవాలు మాట్లాడినట్లు నిరూపిస్తే తాను అసెంబ్లీకి వెళ్లనని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వైఎస్సార్ చేయూత పథకం విషయంలో తాను నిజాలు చెబితే... సభను తప్పుదోవ పట్టించానని ఎలా విమర్శిస్తారని మండిపడ్డారు.
nimmala ramanaidu