తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత నిమ్మకాయల చినరాజప్ప ఖండించారు. కాంగ్రెస్లో ఉండగా సీఎం అవ్వాలనుకున్న బొత్స.. జగన్ను ఎన్ని మాటలన్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. చంద్రబాబుని ఎమ్మెల్యేలు వదిలేస్తారంటున్న బొత్స సత్యనారాయణ రాజీనామాకు జంకుతున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలని అమరావతిని ఎంపిక చేస్తే.. ఎక్కడ చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతో మూడు రాజధానులంటున్నారని విమర్శించారు. అమరావతిని గ్రాఫిక్స్ అంటూ మాట్లాడిన బొత్స అక్కడికి వెళ్లి చూసిన తర్వాత.. ఇంత అభివృద్ధి జరిగిందా అంటూ ఆశ్చర్యపోయారన్నారు. అధికారం చేపట్టిన కొత్తలో అమరావతి రాజధానిగా కొనసాగుతుందన్న మంత్రి.. సీఎం జగన్ మందలించటంతో మాట మార్చారని మండిపడ్డారు.