కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న సాంబశివరావు, కృష్ణంరాజు, వెంకటకృష్ణయ్య, ఆదిశేషు కుటుంబాలను నారా లోకేశ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల సాయం అందించాలని నిర్ణయించారు. త్వరలోనే ఒక్కో కుటుంబానికి చెక్కులు అందజేస్తామని చెప్పారు. అయితే లోకేశ్ అవనిగడ్డ పర్యటన నేపథ్యంలో...ఆదివారం రాత్రికి రాత్రి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అందించారు.
రైతు కుటుంబాలకు నారా లోకేశ్ ఆర్థిక సాయం - కృష్ణా జిల్లాలో లోకేశ్ పర్యటన
అవనిగడ్డలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలను సాయం చేస్తామని తెలిపారు.
tdp leader nara lokesh