ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోడ్ల మీదే ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోరా..?: లోకేశ్ - నారా లోకేశ్

ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని తెదేపా నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని ఆయన హితవు పలికారు.

tdp leader nara lokesh
gిేోే్ి

By

Published : Jul 24, 2020, 10:53 AM IST

వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో వెలుగు చూసిన ఘటన ప్రభుత్వ పనితీరుకు ఉదాహరణ అని అన్నారు. ధర్మవరం వాసి రాజును కుటుంబసభ్యులు ఆటోలో ఆస్పత్రికి తీసుకొచ్చారని... కాపాడాలని 8 గంటలపాటు ప్రాధేయపడినా కనికరం చూపించలేదని దుయ్యబట్టారు. వైద్యం అందక చెట్టు కిందే రాజు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని లోకేశ్ హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details